Friday, August 24, 2007

Armoor Mandal,


ఆర్మూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రము.
ప్రధాన రహదారి మీదనున్న ఆర్మూరు వచ్చేపోయే వాహనాలకు సహజమైన స్టాపు. శిలామయమైన ఇక్కడి కొండలు లక్షల సంవత్సరాల సహజసిద్ధమైన రాపిడి వలన యేర్పడినవి. కొండ మీద నవనాథ సిద్దేశ్వర ఆలయము కలదు. స్థానిక ప్రజలు నవనాథులు లేదా సిద్ధులు ఈ ప్రాంతములోని సహజమైన గుహలు, కొండ చరియలలో ఇప్పటికీ నివసిస్తున్నారని నమ్ముతారు. ఇక్కడికి సమీపమున పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్న ఒక నీటిబుగ్గ యొక్క నీటికి రోగములు, వైకల్యములు నివారించే శక్తి ఉన్నదని భావిస్తారు.

గ్రామాలు
ఆలూరు, అందాపూర్, అంకాపూర్, ఆర్మూరు , బర్దీపూర్ , చేపూర్ , దేగావ్ , ఫతేపూర్ , గగ్గుపల్లి ,
గొవింద్ పేట్ , ఇస్సపల్లి , ఖానాపూర్ , కొమంపల్లి , కోటార్మూరు , మాచర్ల , మగ్గిడి , మామిడిపల్లి ,
మంథని , మెర్డేపల్లి , పెర్కిట్ , పిప్రి , రాంపూర్ , సురబ్రియాల్ .

by: ramu rasa, armoor

No comments: