Tuesday, August 21, 2007

సిద్దుల గుట్ట, ఆర్మూర్. siddula gutta, armoor.


సిద్దుల గుట్ట, ఆర్మూర్

స్థలం : ఆర్మూర్.
జిల్లా: నిజామాబాద్.
రాష్ట్రం : ఆంధ్ర ప్రధేశ్


నల్లని బంతులను ఒక చోట పేర్చినట్టు, విరజిమ్మిన లావా రేణువులు ఒకే చోట కుప్పగా పోసినట్టు కనిపించే ఆర్మూర్ లోని నవనాథ సిధ్ధుల గుట్టను చూస్తే చూపు మరల్చుకోవడం కష్టం కొత్తవారికి మరీ విచిత్రంగా కనిపిస్తాయి. రహదారి వెంట, ఆర్మూర్ పట్టణాన్ని విస్తరిస్తూ సుమారు నలు నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ నవనాథ సిద్దుల గుట్టకు పురణ ఇతిహాసాల్లోనూ ప్రత్యేక కథ్నాలున్నాయి. నవనాథ సిద్దులు ఇక్కడే తపస్సు చేసుకున్నట్టు పురాణాలు చేబుతున్నాయి. అందుకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అందుకే ఈ పట్టణానికి నవనాథపురమని కూడా పేరు ఉంది. ఎంతో ప్రశస్తం కలిగిన ఈ గుట్టలను, గుట్టపై కొలువుదీరిన దొవతా మూర్తులను ధర్శిచుటకు సంధర్శకులు నిత్యం వస్తుంటారు. గుట్టపైన అందాలు ఆరబోసినట్లు పచ్చని ప్రకృతి, అందమైన గుహలు, గుహలో వెలసిన 'నవనాథ సిధ్దేశ్వర ' దేవలయం మరియు గుట్ట మధ్యన విశాలమైన స్థలంలో నిర్మితమైన రామాలయం చూడముచ్చటైనది. గుట్టకు దక్షిణం వైపు రహదారి మార్గం ఉంది. ఈ మార్గం ద్వారా వాహణాలు గుట్ట పైకి వెళ్ళవచ్చు. ఉత్తరం వైపు పట్టణం విస్తరించి ఉంది. ఉత్తరం వైపు గతంలో నిర్మించిన మెట్ల మార్గం కలదు. ఈ మెట్ల గుండ గుట్టపైకి వెళ్ళెటప్పుడు పొందె అనుభూతి మధురం. గుట్టపైన కొండల మధ్య చిన్నపాటీ చురువుంది. మెట్ల మార్గంలో అమ్మవారి దేవలయం ఉంది. ఈ ఆలయాన్ని కొన్నేళ్ళ క్రితం వలస వచ్చిన ఓ సన్యాసి (ప్రస్తుత పూజారి) పరిరక్షిస్తున్నారు. ఆయన అమ్మ వారి కొలువును వదిలి ఇప్పటి వరకు గుట్ట దిగిరాలేదు. అక్కడి నుంది గుట్టపైకి ఎక్కే మార్గంలో హనుమాన్ మందిరం వున్నది. ఇంకా పైకి వెళితే గుహ వుంటుంది. ఈ చీకటి గుహలో శివలింగం, స్వామీజీలు తపస్సు చేసుకునే చోటు కనిపిస్తుంది. అటు నుంచి పై భాగానికి వెళితే రామాలయం కనిపిస్తుంది. ఎంతో సుందరమైన ఈ గుట్టపైన భక్తులకు నీటి సౌకర్యం, సేదదీరేందుకు అనువైన బండరాళ్ళున్నాయి. గుట్టపైన ఉన్న రామాలయం ఎదురుగా కోనేరు ఉన్నది.



1 comment:

A.SURESH said...

avunu, pyna cheppina vidamugaaa entho bagundi aaa siddula gutta, memu SRI KAARYASIDDHI ABHAYANJANEYA SEVA TRUST team memebers andaru okasaari vellaamu, prati okkaru chusi tarinchavalasina pradesam.