తేనెతో లాభాలెన్నో...
- సంకలనం: దుర్గాభవాని
.
1) సహజ సిద్ధంగా లభించే తేనెతో ఆరోగ్యంతో పాటు, అందానికి కూడా ఎన్నో లాభాలున్నాయి. దేవుడికి అభిషేకం చేసే పంచామృతాల్లో కూడా తేనె విశిష్ట స్థానం సంపాదించింది. ప్రతిరోడు వేడి నీటిలో తేనె వేసి సేవిస్తే ఆ రోజంతా ఎంతో తాజాగా, ఉత్సాహంగా ఉంటుంది. గొంతు నొప్పితో బాధపడేవారు వేడినీరు లేదా పాలతో తేనె కలిపి సేవిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మరసం పిండి దానికి రెండు టీస్పూన్ల తేనె కలిపి సేవిస్తే గొంతునొప్పి తగ్గుతుంది. ఓ టీస్పూన్ తేనెలో అరస్పూన్ మిరియాలపొడి చేర్చి బాగా కలిపి సేవించినా ఫలితం కనిపిస్తుంది. అర టీస్పూన్ సొంఠి పొడి, మూడు మిరియాల గింజలు, మూడు లవంగాలు, మూడు యాలికలు, అర టీ స్పూన్ సోంపు కలిపి నీటిలో వేసి కొద్ది సేపు మరిగించిన తర్వాత అందులో కొద్దిగా తేయాకు, తేనె కలిపి బాగా మరిగించాక గోరువెచ్చగా సేవిస్తే గొంతు నొప్పి, జలుబు, దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిని రోజుకు రెండు లేదా మూడు సార్లు సేవిస్తే మంచిది. తేనె కఫంను కూడా తగ్గిస్తుంది. ఎనిమిది నుంచి పది తులసాకులు, రెండు వెల్లుల్లి రేకలు, అర అంగుళం అల్లం, 4 మిరియాలు తీసుకుని బాగా దంచాలి. తర్వాత వాటిని కప్పు నీటితో చేర్చి బాగా మరిగించాలి. దీనికి తేనె కలిపి సేవిస్తే దగ్గు, జలుబుల వచ్చే కఫం నివారిస్తుంది......
.
2) అల్లం రసం, తేనె సమపాళ్లలో తీసుకుని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకుంటే దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది. శొంఠి పొడి. మిరియాల పొడి, తేనె కలిపి రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు సేవిస్తే పొడిదగ్గు తగ్గుతుంది.దగ్గుతో విపరీతంగా బాధపడేవారు ఓ టీస్పూన్ పసుపు, 2- 3 టీస్పూన్స్ అల్లం రసం, 2-3 టీస్పూన్ల నిమ్మరసం, 3 టీస్పూన్ల తేనె కలిపి బాగా కలిపి ప్రతిరోజు మూడు సార్లు సేవిస్తే మంచింది. ఇంగువ కూడా శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది. ఓ టీస్పూన్ ఇంగువలో తేనె కలిపి సేవిస్తే ఆస్థమా, పొడి దగ్గు వల్ల ఊపిరాడకపోవడం తదితర వ్యాధులను నివారిస్తుంది. అల్లంతో పాటు తేనే కలిపి సేవిస్తే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభించడంతో పాటు జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఊభకాయం, కాన్‌స్టిపేషన్, హైపరాసిడిటీల నుంచి ఉపశమనం పొందేందుకు తెల్లవారుజామునే ఓ స్పూన్ స్వచ్ఛమైన తేనెలో అరచెక్క నిమ్మరసం కలిపి గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలిపి సేవిస్తే మంచి ఫలితం లభిస్తుంది........
.
3) తేనె చర్మ వ్యాధుల నుంచి కూడా నివారణ కలిగిస్తుంది. అంతే కాకుండా చర్మ సంరక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. చర్మంపై తగిలిన గాయాలకు (కత్తిగాట్లు, కాలిన మచ్చలు) తరచుగా తేనె రూస్తూ ఉంటే గాయం తగ్గడమే కాకుండా ఆ మచ్చ కూడా కనిపించదనడంలో సందేహం లేదు. తేనే ముఖ వర్చస్సును కూడా మెరుగు పరుస్తుంది. తేనె, పసుపు, శెనగపిండి కలిపి ఫేస్‌ప్యాక్‌లా వేసుకుని 15- 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుకుంటే చర్మకాంతి పెరగడమే కాకుండా వయసుతో వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి. నిమ్మరసంలో తేనె కలిపి ముఖం, మెడ, చేతులకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే కాలుష్యం వల్ల పేరుకున్న మురికి తొలగి పోవడమే కాకుండా చర్మం మంచి నిగారింపు సంతరించుకుంటుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో ఓ టీస్పూన్ తేనె కలిపి సేవించాలి. తేనె శరీరానికి శక్తి కూడా ఇస్తుంది. నెయ్యిలో వేయించిన ఇంగువలో ఓ టేబుల్ స్పూన్ తేనె కలిపి రోజుకు మూడు సార్లు సేవిస్తే జీర్ణశక్తి మెరుగవడమే కాకుండా శరీరాన్ని రోజంతా ఉల్లాసవంతంగా ఉంచుతుంది.
.
(ramu rasa, armoor)
No comments:
Post a Comment