Saturday, September 1, 2007

రేచీకటికి సులభ వైద్యం


>>>> రేచీకటికి సులభ వైద్యం <<<<
సాయంత్రమైందంటే కళ్లు కనిపించక బాధపడేవారా మీరు? చికిత్స నిమిత్తం సతమతమయ్యేవారా మీరు? ఇదిగో ఇక్కడే అన్ని వైద్యవిధానాలు సులభతరంలో... సాయంత్రం వేళల్లో మాత్రమే చూపు మందగిస్తోందంటే అది రేచీకటికి ఆనవాలు. సరైన చికిత్సా పద్ధతులను పాటిస్తే ఈ వ్యాధి నుంచి సులభంగా భయటపడవచ్చు. వైటమిన్ ఎ శక్తి లోపించడం కారణంగానే రేచీకటి వ్యాధి ఏర్పడుతుంది. వైటమిన్ ఎను ఇంజక్షన్, మాత్రలు, టానిక్‌లలో తీసుకుని ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. క్యారెట్, టమోటా, గుమ్మడికాయ, మామిడి, గుడ్డు, వెన్న, చేప నూనె వంటి వాటిలో వైటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. వీటిని రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రేచీకటి వ్యాధి మీ దరికి రాదు.

No comments: