Saturday, November 1, 2008

"సెల్‌ఫోన్ కోచింగ్"తో స్థూలకాయానికి చెక్..!

"సెల్‌ఫోన్ కోచింగ్"తో స్థూలకాయానికి చెక్..!

సెల్‌ఫోన్ వాడకం వల్ల మానవాళికి అనేక కష్ట నష్టాలు పొంచి ఉన్నాయని కొంతమంది వైద్యులు చెబుతుంటే, మరికొంత మంది మాత్రం వాటిని సద్వినియోగం చేసుకుంటే, అనేక లాభాలు పొందవచ్చని చెబుతున్నారు. ఒక పద్ధతి ప్రకారం సెల్‌ఫోన్‌ను వాడటం వల్ల శరీరంలోని అధిక బరువును తగ్గించుకోవచ్చని ఓ తాజా అధ్యయనం చెబుతోంది.
.
అమెరికాలోని బ్రిగామ్ యంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు... సెల్‌ఫోన్ ద్వారా అధిక బరువు సమస్యపై కోచింగ్ ఇచ్చి నడుమునే కాకుండా, మొత్తం శరీరాన్ని నాజూకుగా చేసుకునేలా చేస్తున్నారట. ఇలా వీరి వద్ద సెల్ కోచింగ్ తీసుకున్న 120 మంది స్థూలకాయులు అందగత్తెలు, అందగాళ్లుగా మారిపోయారు.
.
పరిశోధనలో భాగంగా విడివిడిగా 120 మందికి ఫోన్ ద్వారా బరువును తగ్గించుకునే అంశంపై పరిశోధకులు శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమాన్ని 17 వారాలపాటు కొనసాగించారు. మొత్తం 11 విడతలుగా విభజించి ఒక్కో విడతలో 30 నిమిషాలపాటు వారికి ఫోన్ ద్వారా శిక్షణ అందించారు.
.
శిక్షణ పూర్తయ్యాక వీరిని, ఇతర మార్గాల ద్వారా బరువు తగ్గించుకున్న వారితో పోల్చి చూశారు. ఆశ్చర్యకరంగా ఫోన్ ద్వారా శిక్షణ పొందినవారు మిగతా వారితో పోల్చుకుంటే ఎక్కువ బరువు కోల్పోయినట్లు తేలిందని ఈ పరిశోధనలకు నాయకత్వం వహించిన లారీ టకర్ అనే పరిశోధకుడు వెల్లడించారు.
.
కాగా, 30 నిమిషాలపాటు సాగే ఈ సెల్‌ఫోన్ కోచింగ్‌ ఒక్కో సెషన్‌లో అధిక బరువును కరిగించుకునే చిట్కాలు, రోగుల సమస్యలకు తక్షణ పరిష్కారాలను పరిశోధకులు సూచిస్తారు. ఇలా తమ వద్ద కోచింగ్ తీసుకున్న 120 మంది దాదాపు ఏడు పౌండ్ల దాకా బరువు తగ్గించుకున్నట్లు బ్రిగమ్ యంగ్ వర్శిటీ పరిశోధకుల బృందం వెల్లడించింది.